Sri Tattvamu    Chapters   

శ్రీః

శ్రీ విద్యాశంకరపద77మావేప్రకాశిత

జగద్గురు శ్రీ సదాశివానందభారతీస్వాములవారు

శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠము

శ్రీసదనము - గుంటూరు - 2

అస్మదత్యంతప్రియాన్తే వాసి శ్రీబులును సూర్యప్రకాశ శాస్త్రికి, నారాయణస్మరణ పూర్వకముగ వ్రాయించి పంపిన శ్రీముఖపత్రిక:-

మీరు భక్తి పురస్సరముగ పంపిన 'శ్రీతత్త్వ'మును గ్రంథము శ్రీపీఠసన్నిధికి చేరినది. గ్రంథస్థమగు విషయమును విని యానందించినారము. గ్రంథకర్త జౌషనిషద తాంత్రిక లౌకిక గ్రంతస్థములగు నుసాసనా విషయములను

శ్రద్ధాపురస్సరముగ యథామతి సమన్వయము చేయుటకు యత్నించెను. శ్రుత్యర్థ ప్రకాశమునందుగూడ తన యత్యంతాసక్తిని వెల్లడించెను. అయ్యది చాల యభినందింపవలసిన విషయము.

త్రిపునసుందరీ శబ్దార్థనిర్వచనము బ్రహ్మమును స్త్రీరూపముగ నేల ధ్వానింపవలయును? గ్రాయత్రీ మంత్రార్థ నిరూపణము మున్నగు ప్రధానములగు వివిధాములను వివిధార్ధములతో బహుభంగుల నిరూపించెను.

ప్రణవోపాసనా విషయనిరూపణమున తమ కధికారము లేకపోవుటచేతను అయ్యది కేవలము సత్సంన్యాస సంప్రదాయ గమ్యమగుటచేతను అద్దానిని గ్రంథకర్త సృశింపకుండనుండిన బాగుండెడిది. అట్లే జపకాలమున వస్త్రాచ్ఛాదనమునకు హేతువుగా దెల్పు ''ఓంకారః పురుషశ్చైవ'' అను వాక్యము శిష్టగ్రహ్యమగునది కాదు. కావున అట్టి హేతునిరూపణమును త్యజించుటమేలు.

గ్రంథకర్త తన గురువులగు శ్రియానందనాథులయందు అగపఱచిన భక్తి. లోకమున శిష్యుల కందఱకు ఆదర్శప్రాయము.

ఏది యెట్లున్నను ఉపాసనస్వరూపమును దెలిసికొనగోరు జిజ్ఞాసువులకు ఈ గ్రంథ ముపకరించునని చెప్పవచ్చును. గ్రంథకర్త చెప్పినట్లే 'శ్రీదేవికృపన్‌ బెడసి చీకటిలోపడిన లోకమునకు' ప్రకృతకాలమున సత్సంప్రదాయసిద్ధములగు నుపాసనా గ్రంథములత్యంతావశ్యకము లగుటంజేసి యట్టి గ్రంథప్రచారమునకు బూనికొనిన మీకును, అట్టి కృతిక ర్తలకును, కృతిభర్తలకును శ్రీపీఠాధిదేవతయగు శ్రీ రాజరాజేశ్వరీ ప్రతాపభారతీ పరాభట్టారిక ఆయురారోగ్యైశ్వర్యోత్సాహముల నొసంగు గాక యని నారాయణస్మరణమును గావించుచున్నారము.

శ్రీశోభకృచ్ఛావణ శుక్ల                                                             ఇతి నారాయణస్మృతిః

పూర్ణిమా సోమవాసరము                                                        జగద్గురు శ్రీ సదాశివానంద

5-8-1963                                                                                 భారతీమహాస్వామి

Sri Tattvamu    Chapters